దయచేసి సహకరించండి: మాజీ సీఎం కేసిఆర్

Get real time updates directly on you device, subscribe now.

బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుండి వచ్చిన ప్రెస్ నోట్


దయచేసి సహకరించండి

నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు

కోలుకోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా

ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు
యశోద దవాఖాన కు రాకండి
— ప్రజలకు బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 12:
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.

తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు.

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు.
తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు… హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment