ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన: మంత్రి కొండ సురేఖ

Get real time updates directly on you device, subscribe now.

ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన: మంత్రి కొండ సురేఖ

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 12:
మహాత్మ జ్యోతిరావు పూలే భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవా దాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమ స్యను తెలు సుకుని,వారి అర్జీలను తీసుకున్నారు.

ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కోసం వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశo పంపుతున్నట్లు తెలిపారు.

ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎండి దాన కిషోర్, జిహెచ్ ఎంసి కమి షనర్ రోనాల్డ్ రాస్ సమ న్వయం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఎఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరి చందన,హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమి షనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతి బాపూలే ప్రజాభవన్ నందు ఇక నుండి వారానికి రెండు రోజులు పాటు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రజా భవన్ అధికారులు వెల్ల డించారు.

ప్రతి మంగళ వారం, శుక్ర వారం రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యా హ్నం 1 గంట వరకు ప్రజా వాణి జరుగుతుంది.

ఆయా రోజుల్లో ఉదయం 10 గం టల నుండి విజ్ఞాపనలు ఇచ్చుటకు ప్రజాభవన్ కు చేరుకోవాలని అర్జిదారులకు అధికారులు సూచించారు.

ఈ శుక్రవారం 15వ తేదీన ప్రజావాణి వుంటుoదని అధికారులు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment