పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసిన రంగారెడ్డి జిల్లా కారోబార్ మరియు బిల్ కలెక్టర్లు
హ్యూమన్ రైట్స్ టుడే/రంగారెడ్డి జిల్లా/ షాద్ నగర్ నియోజకవర్గం/ డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులు కారోబార్ మరియు బిల్ కలెక్టర్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని ఈరోజు కలవడం జరిగింది సిబ్బంది సమస్యలపై మాట్లాడగా ఆమె స్పందించి త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేసినారు రాష్ట్ర కమిటీ మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కే జంగయ్య కాజా పాషా పాల్గొన్నారు.