TSPSC ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 12:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు.
సోమవారం జనార్దన్ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
నిన్న సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో గవర్నర్ తమిళిసై ఉన్నారు.