జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

Get real time updates directly on you device, subscribe now.

జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..?

జనవరి 7న నోటిఫికేషన్..?

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..?

పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు..

తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..?

జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..?

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్..ఉప సర్పంచ్ ఎన్నిక.

👉 అర్హులు వీరే..

✦ సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.

✦ జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.

✦ ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.

✦ ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత

రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.

✦ పోటీకి కనీస వయసు 21 ఏళ్లు

✦ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.

✦ వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.

✦ రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు.

✦ స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.

✦ దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.

✦ ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.

✦ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment