జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 11:
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
అయితే జానారెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా..తన కుమారుడు జైవీర్ రెడ్డిని పోటీ చేయించి గెలిపిం చాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా జానారెడ్డి ఇంటికెళ్లారు.
తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మందికి చోటు కల్పించగా..మరో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే సీఎం జానారెడ్డికి కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.