ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 11:
తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనను ఒక్క రాత్రిలో మార్చలేమని దీన్నంతటిని సెట్ చేసేం దుకు మార్గాలను పరిశీలిస్తు న్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సోమవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఆయన ఉదయం బాధ్య తలు స్వీకరిం చారు.సచివా లయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..
రెండు శాఖల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్, పర్యాటక శాఖలపై తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షలు చేపట్టి తీసుకురావాల్సిన మార్పులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుం టామన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలం గాణను గత పాలకులు 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం గా మార్చారని ఆరోపిం చారు..ఇంత చేసినా రాష్ట్రం లో ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిం చుకోలేని పరిస్థితికి తెచ్చా రన్నారు.
వీటన్నింటిని మార్చేందుకు ఉన్నపళంగా నిర్ణయాలు సాధ్యం కాదన్నారు. ఇటీవల టూరిజం శాఖ కార్యాల యంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నా మన్నారు.