మాజీ సీఎం కేసీఆర్ ను యశోద ఆసుపత్రిలో పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 10:
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా నూతన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను పరామర్శిం చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి పరమర్శించనున్నారు.
శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వ ర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది.
ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామ ర్శిస్తున్నారు.