అధికారుల వేధింపులకు మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం
హ్యూమన్ రైట్స్ టుడే/మంచిర్యాల జిల్లా/డిసెంబర్ 10:
మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.
బాధితురాలి కథనం ప్రకారం..వెంచపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీలత శుక్రవారం కార్యాలయం నుంచి వెంచపల్లిలోని తన క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
రాత్రి సమయంలో నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరు కోగా..గమనిం చిన భర్త రాజేశ్ వెంటనే మంచి ర్యాల లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ఉన్న తాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు శ్రీలత తెలిపారు.
వెంచపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో బీహార్ కూలీలతో ప్లాంటేషన్ పనులు చేయి స్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
అందుకు డబ్బులు చెల్లిం చాలని బీహార్ లేబర్ కోరగా ఉన్నతాధికారులు చెల్లిస్తా రని శ్రీలత చెప్పారు.
డబ్బుల జాప్యంపై కూలీల బృందం సభ్యుడు జిల్లా అటవీ సంరక్షణాధికారి దృష్టికి తీసుకెళ్లాడు. కూలీ లకు వెంటనే డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారి ఆదేశించారు.
ఈ విషయమై మాట్లా డేందుకు తన కార్యా లయానికి రావాలని శుక్రవారంశ్రీలతకు కోటపల్లి రేంజర్ రవి ఫోన్ చేశారు.సాయంత్రమైనా రేంజర్ కార్యాలయానికి రాకపోవడంతో ఆమె ఇంటికి బయల్దేరారు.
ఆ సమయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా ఫోన్ చేసి, తిరిగి కార్యాలయానికి రావాలని రవి సూచించారు. దీంతో శ్రీలత తిరిగి రేంజ్ కార్యాలయానికి వెళ్లారు.
నీ వల్లే నాకు చెడ్డపేరు వచ్చిందని,అందుకే నిన్ను సస్పెండ్ చేస్తానని రేంజర్ బెదిరించినట్టు శ్రీలత తెలిపారు.మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యా యత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని రేంజర్ రవి పేర్కొన్నారు.
తాను ఎవరినీ వేధించలేదని చెప్పారు. విధులకు సంబంధించి సూచనలు చేశానే తప్ప దూషించలేదని స్పష్టం చేశారు.