హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 09:
తెలంగాణ శాసనసభ సమా వేశాలు ఈ నెల14వ తేదీకి వాయిదా పడ్డాయి.
తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమా ణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను14వ తేదీకి వాయి దావేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
అదే రోజున స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించను న్నారు.
తర్వాత రోజు గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.
ఆ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయిం చనున్నారు.