హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/17 జనవరి 2023: తెలంగాణ అస్తిత్వాన్ని సిఎం కెసిఆర్ దెబ్బకొడుతున్నారని బిజెపి ఎంఎల్ఎ రఘునందన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం ఖండిస్తున్నానన్నారు. అసమ్మతి ఉందన్న బిఆర్ఎస్ ఎంఎల్ఎల లిస్టును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బయటపెట్టాలని సవాలు విసిరారు. 20 నుంచి 30 మంది ఎంఎల్ఎల పేర్లు బయటపెడితే ప్రజల వారిని ఎన్నుకోవాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారన్నారు.