తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం: ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 09:
తెలంగాణ రాష్ట్రంలో పారి శ్రామిక ఐటీ రంగాలను మరింత బలోపేతం చేస్తా మని, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చటమే ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ,శాసన సభ వ్యవహారాల శాఖశాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
శ్రీధర్ బాబుకు పోర్టు ఫోలియోలు ఖరారు చేసిన తర్వాత ఆయన మాట్లా డుతూ.. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటిం చిన ఐటీఐఆర్ రివిజన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరు పనున్నట్లు ఆయన తెలిపారు.
ఫార్మాసిటీని నెలకొల్పే విష యంలోనూ ప్రజల అభి ప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసు కోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
అన్ని అంశాలపై శాసన సభలో చక్కటి చర్చ జరిగేలా చర్యలు తీసు కుంటామని వివరించారు.