హ్యూమన్ రైట్స్ టుడే/హన్మకొండ జిల్లా/డిసెంబర్ 08:
హన్మకొండ నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.
హాస్పిటల్ లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.