హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/డిసెంబర్ 08:
తండ్రిని కొడుకు చంపిన దారుణ ఘటన పెద్దపెల్లి జిల్లాలోని పూసాల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామం లో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు.
అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకు వెళ్లారు.అనం తరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయి స్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు తీగల రాజేశం ఆవేశానికి లోనై య్యాడు. క్షణికా వేశంలో విచక్షణ కోల్పో యిన తీగల రాజేశం కన్న తండ్రిని పక్కనే ఉన్న బండరాయితో తన తండ్రి తీగల నరసయ్య తల పైన బలంగా కొట్టాడు.
దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య మృతిచెందారు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసు లకు సమాచారం అందిం చారు.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.