ఎస్సై ఉద్యోగ ఫలితాలు ప్రకటించుకోవచ్చు: ఏపీ హైకోర్టు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/అమ‌రావతి/డిసెంబర్ 05:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

త‌మ ఎత్తు కొల‌త‌ల‌ విష‌యంలో అన్యాయం జ‌రిగిందంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను విచార‌ణ అనంత‌రం కొట్టివేసింది.

కాగా, ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు.

అయితే రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్మెంట్పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.

ఉత్తర్వులను ఎత్తేసిన నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇది ఇలా ఉంటే పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాజది జడ శ్రావణ్ కుమార్ 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ను న్యాయస్థానానికి అందించారు.

దీంతో అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ పునః పరిశీలన చేసి వారం రోజుల్లో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను హైకోర్డు ఆదేశించింది.

తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment