కురుస్తున్న వర్షాలు..

Get real time updates directly on you device, subscribe now.

*ఆంధ్ర,తెలంగాణలో కురుస్తున్న వర్షాలు*

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 05:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ప్రస్తుతం చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్ మధ్యాహ్ననికి నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు,మహబూబాబాద్‌నల్గొండ, సూర్యాపేట..హనుమకొండ, వరంగల్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

జనగామ, భూపాలపల్లి, భువనగిరి.పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది.


*హైదరాబాద్ లో కురుస్తున్న వానలు*

మరోవైపు తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బేగం పేట్, బోయినపల్లి, బాలానగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ , బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

*నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం*

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మరో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తేలింది.ఆయా జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment