భారత్‌, కివీస్ మధ్య జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్‌..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023 : లంకేయులపై టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో, వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుని మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో సమరానికి సై అంటోంది. పాకిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుని న్యూజిలాండ్‌ కూడా జోరుమీదుంది. భారత్‌, కివీస్ మధ్య జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్‌, 27 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తుండగా.. టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరి ఏ మ్యాచ్‌.. ఎప్పుడు, ఎక్కడ జరగనుంది, ఎలా వీక్షించాలి, ఇరుజట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

వన్డే సిరీస్ షెడ్యూల్‌

తొలి వన్డే- జనవరి 18.. వేదిక: హైదరాబాద్‌ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

రెండో వన్డే- జనవరి 21.. వేదిక: రాయ్‌పూర్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

మూడో వన్డే- జనవరి 24..
వేదిక: ఇందౌర్‌ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

*టీ20 సిరీస్‌ షెడ్యూల్‌*

తొలి టీ20- జనవరి 27.. వేదిక: రాంచీ (రాత్రి 7 గంటలకు)

రెండో టీ20- జనవరి 29.. వేదిక: లఖ్‌నవూ (రాత్రి 7 గంటలకు)

మూడో టీ20- ఫిబ్రవరి 1.. అహ్మదాబాద్‌ (రాత్రి 7 గంటలకు)

ఎలా చూడాలి?

ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ లైవ్‌ టెలికాస్ట్ చేస్తుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో వీక్షించొచ్చు.

గత రికార్డులు ఇలా..

వన్డేల్లో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియాకు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 113 మ్యాచ్‌లు జరిగ్గా.. 55 మ్యాచ్‌ల్లో భారత్‌ జయకేతనం ఎగురవేయగా.. 50 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. ఏడింటిలో ఫలితం తేలలేదు. టీ20ల్లోనూ భారతే ఆధిపత్యం కొనసాగిస్తోంది. 22 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్‌ 12, న్యూజిలాండ్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

వన్డేలకు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

టీ20లకు భారత జట్టు:

హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి, పృథ్వీ షా, ముఖేశ్‌ కుమార్‌.

వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టు:

టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.

టీ20లకు న్యూజిలాండ్‌ జట్టు:

మిచెల్ శాంట్నర్ (సి), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment