ఎన్నికలు
ప్రజల ఓటు
పాలకుల సింహాసనం మీద
నియంతృత్వముగా
పరివర్తనం చెంది
ప్రజలంతా దగాపడి
కన్నీళ్ల కాలువలో
పాలకుల హామీలు
పడవలుగా పయనిస్తుంటాయ్
కండువాలు మోసిన భుజాలు
పాలకుల పన్నులతో బరువెక్కుతాయి
పిడికిళ్లేత్తిన జెండాలు
పేదరికంతో రేపరెప లాడుతాయి
పాలకుల నినాదాలు
ప్రజల కడుపులో ఆకలిగా మండుతాయి
పెరిగిన ధరలు
రైతుల ఆత్మహత్యలు
అడబిడ్డల హత్యాచారలు
నిరుద్యోగుల చావులు
అవినీతి అన్యాయలు
ఆనవాయితీగా జరుగుతుండగా
నాయకుల అమ్మకాలు
కొనుగోళ్ళు
ప్రభుత్వల ప్రతిపక్షాల
పార్లమెంట్ అసెంబ్లీయుద్ధాలు
ఆసక్తిగా చూసే మనం
ఆకలితో దేశం
మాట్లాడుతుంటే
ఆర్తనాదాలు వినం…
**దర్పల్లి సాయికుమార్**