కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాశమై..

Get real time updates directly on you device, subscribe now.

కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి – కొన్ని ఉదాహరణలు.
హ్యూమన్ రైట్స్ టుడే/డిసెంబర్ 04:
1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.

2. 2009 ఎలక్షన్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.

3. మహా మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 cases లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.

4. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి – కనీసం శవం కూడా దొరకలేదు.

5. ఇప్పటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి – 16 నెలలు జైలులో ఉన్నారు.

6. 1978 లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద – సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.

7. తమిళ ప్రజలతో *అమ్మ* అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత – అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.
టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది.
చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.

8. ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.

9. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.

10. జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో – ఆత్మహత్య చేసుకున్నాడు.

11. గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం – గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.

అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు, NDA కన్వీనర్ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి – విఫలమైన నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయ్యాడు.

ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ, కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం…. చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి!
ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే – చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

*అందువల్ల “నేనే” అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు.*
*నేనే గొప్ప, నా వల్లనే అంతా జరుగుతుంది – నా సంఘమే గొప్ప, నా పార్టీ నే గొప్ప, మా నాయకుడే గొప్ప, మాదే అంతా – అనే వ్యక్తి అహంకార విధానం అవసరం లేదు.*

ఈ నేనే అన్న – ఈ భూమికి మనం *అరువు* గా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే *ఎరువు* గా మారిపోతాం.
ఈ మధ్యలో *పరువు* గా బతికేద్దాం.
ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.
*కాలం* కంటే *వేగంగా* మనసులు మారే *మనషుల* మద్య మనం *బ్రతుకుతున్నాం.*
అందుకే ఎవరితో ఎంతవరకూ *ఉండాలో* అంతవరకే ఉండాలి మనం.
జీవితంలో అన్నీ *కోల్పోయినా* ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ *సిద్దంగా* ఉంటుంది.
దాని పేరే *భవిష్యత్తు.*

మనిషి జీవితం *మేడిపండు* లాంటిది మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ, లోపల అన్ని *పురుగులే* ఉంటాయి.

*మనిషి జీవితం కూడా అంతే.*

ఒకరి జీవితం మరోకరికి *అందంగానే* కనబడుతుంది.
కానీ ఆ జీవితంలో దాగి ఉన్న *కష్టాలు కన్నీళ్ళు* ఎవరికీ కనిపించవు.

మనం మనిషిగా పుట్టడమే ఒక *అద్భుతం.*
బతికి ఉండటం ఒక *అదృష్టం.*
ముడి పడుతున్న *బంధాలన్ని* వరాలు.
ఎదురు పడుతున్న అడ్డంకులన్ని, మనకు విలువైన *పాఠాలు.*

కష్టం గురించి *చింతించక* ఉన్నన్నాళ్లు *ఆనందంగా* గడిపేద్దాం.😊

అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం అవసరం.🤘🏼🙏🙏🙏🙏🙏🙏 Mee 💖 Sallah uddin

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment