నేడు సీఎల్పీ సమావేశం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 04:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరనుంది.
కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది.
ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తరువాత అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్ననది గవర్నర్ కు తెలియజేస్తారు.
ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.