అంతా అనుకున్నట్టే అయింది.! ఇది ప్రజాస్వామ్యం! ఇదే రాజ్యాంగం! ఇదే ప్రజతీర్పు!
అహంకారం, అహంభావం,
నియంతృత్వం నిస్సిగ్గు
తుడిచిపెట్టుక పోయింది..
నోటికి వచ్చిన మాటలతోనే
ఈరోజు నోటికి మూత పడింది.
జీతం అడిగితే జీతగాల్లలెక్క
భత్యేం అడిగితే బానిసలెక్క
హక్కులు అడిగితే హౌలాలెక్క
చూసిన మీ మదం
ఒక్క ఓటు పోటుతో చెరిగిపోయింది.
317 తో పుట్టకొకరు చెట్టుకొకరుగా
అమాంతంగా విసిరేశారు..,
ఏడ్చినా చచ్చినా ధర్నా చేసినా
దయ చూపలేదు
ఆ కసి ఈరోజు కాటు వేసింది.
పీఆర్సీ పేరిట కోత కోసిన
33 నెలల బకాయి
డీఏ ల మాటున నొక్కిన
లెక్కలేనన్ని విడతలు
ఈ విడత నిన్ను లేకుండా చేసింది.
రెండు సార్లు
గ్రూప్1 రద్దు అయినా
పేపర్లు లీక్ అవడం
సహజం అన్న మాటతో
లక్షలాది నిరుద్యోగుల
గాయపడ్డ గుండెల మంట
ప్రగతి భవన్ గేట్ ముందు మంట పెట్టింది.
బంధు అంటూ సాగించిన నాటకం
రక్తి కట్టించలేదు,
ఎత్తులు పై ఎత్తులు వేస్తే
అధికారం నిలవదు..
నీ కాలు భూమి మీద నిలవాలి.
ఎక్కడ నుండి అయినా
పాలన చేస్తా,
నేను దొరను..
అంటే చెల్లదు అని తీర్పు వచ్చింది
అడిగిన వాడిని ద్రోహి అని
అధికారంతో మీరు వేసిన ముద్ర
నేడు తుడిచి పెట్టుకు పోయింది.
మాది బరాబర్ కుటుంబ పాలనే,
ఇంగ్లీష్ వస్తె చాలు గొప్ప
అన్న మీ పలుకులు
తప్పు అని రుజువు అయ్యాయి.
ధర్నా చౌక్ మా హక్కు,
నిరసన మా డీఎన్ఏ,
ప్రశ్నించడం మా అస్తిత్వం
ఉచితం లేకున్నా బతుకుతాం
కానీ బాంచెన్ అనం అని
రాష్ట్రం నేడు తెగించి చెప్పింది.
మీడియాను చేతిలో పెట్టుకుంటే
చాలని భావించారు
అది సమయం చూసి దెబ్బ కొట్టింది
బిడ్డ ఏం చేసినా ఒప్పంటే
చూస్తూ ఊరుకునే సమాజం కాదని
తెలంగాణ తెలివి చూపింది.
అడ్డగోలుగా దోచిన సొమ్ముతో
ఓట్లు కొనే కుట్రకు గండి పడింది
ప్రాజెక్టుల పేరిట మీ దోపిడీ
ఈరోజు అధికారానికి
నిలువు దోపిడి చేసింది.
పెద్ద అంటే పెద్దరికం ఉండాలి
మాట అంటే తేటగా ఉండాలి
పాలనలో ప్రజాస్వామ్యం ఉండాలి.
అదికారం కోసం వచ్చిన ఒక్కరిద్దరు దోపిడి చేసిన సొమ్ముకొంత పెట్టి మాయదారి మాటలతో గెలిసినా వారు నీ పార్టీలో వుంటరని నమ్మకం లేదు.
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో
ప్రతిపక్షంలో పలక పట్రుకో
ప్రజల నడుమ ఇల్లు కట్టుకో
ఒంటరిగా దూరంగా జీవిస్తే
అదే ఒంటరితనం
అదే దూరపుతనమే మిగులుతుంది.
*ఓటరు ఎన్నడూ ఓడలేదు, నియంతృత్వం ఎన్నడూ నెగ్గలేదు.*
ఇది చరిత్ర,
తెలంగాణలో మరో చరిత్ర..!