హ్యూమన్ రైట్స్ టుడే/డిసెంబర్ 03: ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమగ్ర అభివృద్ధికి బదులు కుటుంబ అవినీతి నియంతృత్వ పాలనను సాగించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఒక ప్రకటనలో జేజేలు పలికారు. కెసిఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని కేవలం సంక్షేమ పథకాలతో రాజకీయాలు నడిపిందని తెలంగాణ సమాజం అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం అందించారని ఆయన అన్నారు రాష్ట్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి అన్ని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రజాస్వామిక ప్రజా పాలన అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.