విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ/డిసెంబర్ 3: 2009 డిసెంబర్ 3న శ్రీకాంతచారి అమరుడయ్యాడు..

ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చి శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు

*రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారు.*

జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారు.

తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

*ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నాం.*

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం

ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది..

ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..

*ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తాం..*

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం

ప్రభుత్వంలో సీపీఐ,జనసమితి ఆలోచనలను స్వీకరిస్తాం

కూటమి గెలుపుకు సహకరించినందుకు సీపీఐ, కోదండరాం గారికి కృతజ్ఞతలు

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం.

ప్రజా తీర్పును బీఆరెస్ శిరసావహించాలి..

*ప్రభుత్వ ఏర్పాటుకు వారి వైపు నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం*

ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీఆరెస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం.

పరిపాలన ఇక గతంలోలా ఉండబోదు…

*సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయి*

*ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ భవన్ గా మారుస్తాం*

ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్

సామాన్యులకు అందులో ప్రవేశం ఉంటుంది.

కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు.

*- టీపీసీసీ రేవంత్ రెడ్డి*

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment