పాలకుర్తిలో 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వీని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓటమి..
హ్యూమన్ రైట్స్ టుడే/జనగామ జిల్లా/డిసెంబర్ 03:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతున్నాయి. గెలుస్తారనుకున్న కీలక నేతలు ఓడిపో తుండగా..ఎవరూ ఊహించని అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.
పాలకుర్తిలో సైతం ఇలాంటి ఫలితమే వచ్చింది. 30 ఏళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వీని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓటమి చవి చూశారు.
దుబ్బాకలో సైతం ఇలాగే షాకింగ్ రిజల్టే వచ్చింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసు కుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి ఘన విజయం దిశగా హస్తం పార్టీ పయణిస్తోంది.