హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023 : జాతీయ రాజకీయాలపై రేపు సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశం చూపు ఖమ్మం వైపు ఉందని, ఈ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. భాజాపాకు తెలంగాణలో స్థానం లేదని, గత ఎన్నికల్లో భాజాపా ఒక్క సీటే గెలిచిందని మంత్రి తెలిపారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే 3 చట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. బీజీపే ఏ ఒక్క వర్గానికి మేలు చేయడం లేదని, దేశ ప్రజల్లో ఆపార్టీపై వ్యతిరేకత ఉందని, ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని మంత్రి వెల్లడించారు. నేడు తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. అంతేకాదు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడం. ఆత్మగౌరవం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని హరీశ్ రావు తేల్చి చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తుమ్మల నాగేశ్వర్‌తో కలిసి హారీశ్ రావు సభా స్థలిని పరిశీలించారు.
జాతీయ నేతలు రాకతో….
దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించేందుకు కేసీఆర్ మొదలుపెట్టిన బీఆర్ ఎస్ పార్టీకి జాతీయ నేతలు మద్దతిస్తున్నారు. రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా విపక్షాల ఐక్యత చాటనున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభకు హాజరుకానున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ నేత రాజా ఖమ్మం సభలో పాల్గొంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు…
భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు, వీవీఐపీలతో పాటు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. అందుకని 4 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలకు స్పెషల్ పాస్‌లు అందించనున్నారు. 00 ఎకరాల్లో సభాస్థలాన్నిఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ జరిగే ప్లేస్‌కు 500 మీటర్ల లోపు దాదాపు 480 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేయనున్నారు. పోలీసులకు సహాయంగా వాలంటీర్ల నియమించారు. ప్రజలకు మజ్జిగ, మంచినీళ్లు అందించున్నారు.