భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారి భద్రత*!
హ్యూమన్ రైట్స్ టుడే/ వేములవాడ/డిసెంబర్ 01: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది, ఓటింగ్ అనంతరం ఈవీఎం లను ఎన్నికల కమిషన్ గుర్తించిన వివిధ ప్రాంతాలలో పోలింగ్ బాక్స్ లను భద్రపరిచారు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది..
ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమ తించడం జరుగుతుంది. ఇతరులకు ఎవరికి స్ట్రాంగ్ రూమ్‌లోకి అనుమతి లేదన్నారు.
ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో బందో బస్తు నిర్వహిస్తున్నారు.