రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అభ్యర్థుల కీలక భేటీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్‌తో పాటు మరికొంత మంది అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని రేవంత్ రెడ్డికి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయ బోతుందని ఎగ్టిట్ పోల్స్ అంచనాల ప్రకటించిన నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది.
ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు ఊహా గానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా ఈ భేటీలో నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా చాలా చోట్ల రాత్రి వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు ఓటములపై ఎలా ఉండబోతున్నదనేది విశ్లేషించుకుంటున్నారు.