సినీ పరిశ్రమలో విషాదం..

Get real time updates directly on you device, subscribe now.

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు.

ఆమె వయసు 87 సంవ త్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుబ్బలక్ష్మి..కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి నివా ళులర్పించారు.

తెలుగు, తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా సినిమాలలో సుబ్బలక్ష్మి నటించారు. మలయాళ చిత్ర సీమలో చేసిన అమ్మమ్మ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువ‌చ్చాయి.

తెలుగులో కళ్యాణ రాముడు, ఏ మాయ చేసావె సినిమాలో కనిపించారు. ఏ మాయ చేసావెలో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారి విజయ్‌ బీస్ట్‌ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె ఎన్నో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు.

సినీ పరిశ్రమలోకి రాకముందు జవహర్‌ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా సుబ్బలక్ష్మి పని చేశారు. 1951లో ఆల్‌ ఇండియా రేడియోలో కూడా ఉద్యోగం చేశారు.

దక్షిణ భారతదేశం నుంచి ఆల్‌ ఇండియా రేడియోలో పని చేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చు కున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment