హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 30:
తెలంగాణ ఎన్నికల పోరులో గెలిచేది ఎవరు? అనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకారం ఈసారి ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడు?
ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితం వెలువడనుంది.
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా?
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకోని కాంగ్రెస్‌కు ఓటు వేశారా? పోరుగడ్డలో బీజేపీ గెలవబోతున్న స్థానాలెన్ని? ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా,పోలింగ్ ముగి యడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.
ఈసారి ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే..మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ కి జై కొట్టాయి. ఈసారి కాంగ్రెస్ దే అధికారం అంటున్నాయి.
*ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..*
బీఆర్ఎస్ 48
కాంగ్రెస్+ 56
బీజేపీ+ 10
ఎంఐఎం 05
*అరా ప్రీ పోల్ సర్వే..*
బీఆర్ఎస్- 41 నుంచి 49 సీట్లు
కాంగ్రెస్- 58 నుంచి 67 సీట్లు
బీజేపీ- 5 నుంచి 7 సీట్లు
ఇతరులు- 7 నుంచి 9 సీట్లు
ఓట్ షేర్ వివరాలు..
బీఆర్ఎస్ – 39.58శాతం
కాంగ్రెస్ – 41.13 శాతం
బీజేపీ – 10.47 శాతం
ఇతరులకు – 8.82శాతం