సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం నిషేధించబడింది:CEO
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 38: ప్రచార పర్వం ముగియడంతో సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం కూడా నిషేధించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
ప్రింట్ మీడియాలో అనుమతి ఉన్న ప్రకటనలకు అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
టీవీ, రేడియో, కేబుల్ నెట్‌వర్క్ ప్రచారం నిషేధం.. ఓటరు స్లిప్పులపై పార్టీ గుర్తులు ఉండకూడదు.. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం.. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది ఓటు వేశారని వికాస్‌రాజ్ తెలిపారు.