1994 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో పని చేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి అదే గ్రామంలో నివాసం ఉంటూ ప్రభుత్వ ఆస్తులు ఎటువంటి ఆక్రమణలకు గురి అవకుండా కాపాడాలని చట్టం చెబుతోంది. కానీ ఏ పంచాయతీ కార్యదర్శి కూడా తను పని చేస్తున్నటువంటి గ్రామంలో ఉండకపోవడమే కాకుండా ప్రభుత్వ ఆస్తుల కి ఎటువంటి రక్షణ కూడా కల్పించడం లేదు, ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ సచివాలయ వ్యవస్థ ఏం చేస్తుంది.