డబ్బు పంపిణీకి రంగం సిద్ధం

Get real time updates directly on you device, subscribe now.

చాప కింద నీరులా డబ్బు పంపిణీకి రంగం సిద్ధం❓️
రూ. 1500 నుంచి 2000 ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయకుండా..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 28:
తెలంగాణ లో ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు వాళ్ళ నాయకులు ఇన్నాళ్లు చేసిన ఎన్నికల ప్రచారంతో అభ్యర్థుల గెలుపు లపై ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఓటరును ఆకర్షించేందుకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునేందుకు నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.


రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాలలో తమకు అనుకూలమైన వాతావరణం కల్పించిన డబ్బుల పంపిణీ తో ఎక్కడ ఓటర్లు మనసు చెదిరిపో తుందోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. అందుకే ఓటర్లకు డబ్బులు పంచాలని, అన్ని ప్రధాన పార్టీల నాయకులుఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది..


అయితే ఇందులో పక్క పార్టీ వాళ్ళు ఓటుకు ఎంత డబ్బు ఇవ్వన్నారో దాని కంటే కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి ఓట్లు రాబట్టుకోవాలని మరొక పార్టీ పన్నాగం పన్నుతున్నట్లు ప్రచారం.

ఇప్పటికే ఓ పార్టీ ఓటుకు రూ.1000లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.. ఆ క్రమంలోనే మరొక పార్టీ రూ. 1500 నుంచి 2000 ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయకుండా ఉండాలనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ప్రధాన పార్టీలు1 లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డట్టు సమాచారం..


ఓటర్లకు పెంచాల్సిన డబ్బులు ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి డంపు చేసినట్లు సమాచారం. డబ్బులు ఇచ్చే ముందు పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సొమ్ము ముట్టు చెబితే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావంలో ఇరు పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.

ఇదే కాకుండా ఇప్పటికే గ్రామాలలో మద్యం సీసాలు కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది.15 రోజులుగా డబ్బుల ఖర్చుకు ఇష్టం లేని నేతలు ఈ రెండు రోజుల్లో ఎంత సొమ్ము ఖర్చు అయినా సరే తాము గెలవాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment