గెలిపిస్తే జయయాత్ర ఓడిస్తే శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ జిల్లా/నవంబర్28:
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వ హించిన ఎన్నికల ప్రచా రంలో భాగంగా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసం గించారు.
ఈసారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసు కుంటానని వేడు కున్నారు.చంపు కుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు.
డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువ డతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయ యాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని కోరారు.