కలకలం రేపిన మోడల్ స్కూల్లో టీచర్ల మధ్యన ప్రేమ వ్యవహారం..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్/17 జనవరి 2023: జిల్లాలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా సైన్స్, తెలుగు టీచర్ల మధ్యన ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వీరి ప్రవర్తన పట్ల విసుగు చెందిన విద్యార్థులు వీధికెక్కారు. పెద్దెముల్ మండలం గోట్లపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఇటీవల ప్రిన్సిపల్ గాయత్రి, సిబ్బంది మధ్య వివాదం రాజుకుంది. ప్రిన్సిపల్ గాయత్రి పై కుల వివక్షతోపాటు, విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. తాజాగా అదే స్కూల్లో పనిచేసే మరో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని విద్యార్థులు బయటపెట్టడం సంచలనంగా మారింది. స్కూల్ ప్రాంగణంలో రాసలీలు కొనసాగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే మోడల్ స్కూల్లో కొనసాగుతున్న వివాదంపై ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment