మందు బాబులకు ఇక జగరమే..నేటి నుంచి వైన్స్ షాప్ లు బంద్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 28:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.ఈ వార్త మందుబాబులకు కొంచం బాధ కలిగించిన తప్పని పరిస్థితి మరి.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజ మానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం చేసింది.
ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదే శాలను పాటిం చకపోతే.. లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చ రించింది.