హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 28:
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారంతో తెరపడ నున్నది.పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో మంగ ళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగి యనున్నది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ప్రచార గడువు ముగి యగానే నియో జకవర్గాల నుంచి స్థానికేతర నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
గురువారం జరుగనున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీఆర్‌ఎస్ విజయం కోసం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ మంగళవారం గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
గత ఎన్నికల సమయంలో చివరి సభను గజ్వేల్‌లో పెట్టిన సీఎం కేసీఆర్.. ఈసారి కూడా అదే అనవాయితీని కొనసాగించనున్నారు.
నేడు ఏఆర్వోల సమావేశం
పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.
పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయింది. ఈవీఎంలను నియో జకవర్గాలకు చేర్చిన ఎన్నికల సంఘం.. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో సమావేశాన్ని నిర్వహించనున్నది.
సీఈవో వికాస్‌రాజ్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
*ఓటర్ల ప్రశాంతతకు భంగం కలిగించొద్దు*
ఓటర్ల ప్రశాంతతకు భంగం కలిగించొద్దు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిశాక ఓటర్ల మానసిక ప్రశాంతతకు ఎలాంటి భంగం కలిగించరాదని, సినిమా హాళ్లతోపాటు టీవీలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించకూడదని సీఈవో వికాస్‌రాజ్ అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు స్పష్టం చేశారు.
ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు, దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఏ చర్య అయినా దీని పరిధిలోకి వస్తుందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రచార పర్వం ముగిసి నప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయకూడదని, ఓపీనియన్ పోల్స్, చర్చా కార్యక్రమాలు, విశ్లేషణలు, విజువల్స్, సౌండ్ బైట్స్ విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేశారు.