విద్యా శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు తల్లి దండ్రుల మనవి

Get real time updates directly on you device, subscribe now.

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (Reg.no.6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ వారి ద్వార…

తేదీ 27/11/2023


గౌరవనీయులైన విద్యా శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు,


తల్లి దండ్రుల మనవి,



విషయం– ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పెంపు తాజా జీవో ను రద్దు చేయాలని – విద్యాశాఖ అనుమతు లతో ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలలో చదివే వారు కూడా మీ పిల్లలే అని మర్చిపోవద్దు–పాఠశాల విద్యాశాఖ నియమ నిబంధనలు–ఫీజుల దోపిడీ-అర్హత లేని అధ్యాపకులు తదితర అంశాలపై తమరు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్ని స్వయంగా పరిశీలించ గలరని తగు చర్యలు తీసుకోగలరని కోరుతూ,–


ఆర్యా,


విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల కు పొడిగించారు చట్టం అమలు కు.భారత పార్లమెంటు ఆమోదించిన, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వులు, రాష్ట్రం లో చట్టం అమలుకు అధికారులను జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన. హై కోర్టు తీర్పుల ఫలితం గా విద్యాహక్కు చట్టం- 2009 రాష్ట్రంలో అమలు కు నోచుకుంది చట్టం లోని ప్రధాన నిబంధనలను సవరించి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఇది గౌరవ పార్లమెంటు ను ,అత్యున్నత న్యాయస్థానం తీర్పు లను వ్యతిరేకించడమే అని మేము భావిస్తున్నాము.
ప్రైవేటు పాఠశాలల యజమానులు, ఎమ్మెల్సీలు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు అనుకూలమైన నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.వెంటనే తాజా జీవో ను రద్దు చేయాలని విద్య హక్కు చట్టం 2009 ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము

పాఠశాల విద్యాశాఖ నియమ నిబంధనలకు లోబడి విద్యా శాఖ నుండి అనుమతి పొందిన ప్రైవేటు విద్యా సంస్థలు ఏవి విద్యాశాఖ నియమ నిబంధనలు అమలు చేయడం లేదు.. ఏ రోజు రాష్ట్ర, జిల్లా ఏ స్థాయి విద్యాశాఖ అధికారులు ఏ ప్రైవేటు విద్యా సంస్థను సందర్శన కానీ పర్యవేక్షణ కానీ, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనీ తెలియజేస్తున్నాము..
రాష్ట్రంలో ఏ ఏ ప్రైవేటు పాఠశాలలు… విద్యాశాఖ ప్రభుత్వ జీవో లు జీవో నెంబర్ ఒకటి, విద్యా హక్కు చట్టం 2009 నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయో తెలుపగలరు. మరియు రాష్ట్ర, జిల్లా ఏఏ స్థాయి విద్యాశాఖ అధికారులు ఏ ఏ ప్రైవేటు విద్యా సంస్థలను సందర్శన చేశారు , జీవో లలోని అంశాలను అమలు చేయని ఏ ఏ పాఠశాలల పై చర్యలు తీసుకున్నరో వివరాలతో శ్వేతా పత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రైవేటు పాఠశాలలో చదివే వారు కూడా. మీ పిల్లలే అని మర్చి పోవద్దని, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలు, రాయితీ లు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలు పథకాలను పొందుతూ కూడా ఏ పాఠశాల విద్యాశాఖ నియమ నిబంధనలు అమలు చేయడం లేదు .. లక్షల రూపాయల ఫీజుల దోపిడీ చేస్తున్నారు.మరియు-అర్హత లేని అధ్యాపకుల.భోధన తదితర అనేక అంశాల పై తమరు దృష్టి పెట్టగలరని కోరుచున్నాము
రాష్ట్రంలో స్వయంగా తమరు రాష్ట్ర, జిల్లాలలోని విద్యాశాఖ అధికారుల సిబ్బందితో ప్రైవేటు పాఠశాలలను కూడా పరిశీలించ గలరని తగు చర్యలు తీసు కోగలరని విద్యార్థి తల్లిదండ్రులం విశ్వసిస్తున్నాము..


కాఫీ టు

గౌరవనీయులైన ముఖ్యకార్యదర్శి గారికి,,
పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గౌరవనీయులైన కమిషనర్ గారికి, పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



అభివందనములతో

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ. .

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment