ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?: రఘునదనరావు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మం సభపై కీలక వ్యాఖ్యలు చేశారు. మియాపూర్‌లోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తోట చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారని విమర్శించారు. సోమేష్‌కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కామ్ జరుగుతోందన్నారు. భూ స్కామ్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందన్నారు. సుఖేష్‌గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్.. తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. కేసీఆర్‌కు గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్రవాళ్లు ఇప్పుడు బంధుమిత్రులుగా మారిపోయారని రఘునందన్‌రావు విమర్శించారు.