హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /November 27: ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారం తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ గప్చుప్ కానున్నాయి. ఇక, పోలింగ్కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో ఓ వైపు ఓటుకు నోటు పంచుతూనే మరోవైపు పోల్ మేనేజ్మెంట్పై నేతలు నజర్ పెట్టారు. ఇప్పటికే రూ. కోట్లలో నగదు నియోజకవర్గాలకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభంకానుంది.