పదేళ్ల పాలన లో నువ్వు ఏం చేశావో చెప్పగలవా కేసీఆర్: రాహుల్ గాంధీ
హ్యూమన్ రైట్స్ టుడే/సంగారెడ్డి జిల్లా/నవంబర్ 26:
ఈ పదేళ్లలో పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కెసిఆర్ చెప్తారా? అని అందోల్ నియో జకవర్గం విజయ భేరి సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిం దన్నారు. కెసిఆర్ దోపిడీ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగి పోయిందన్నారు.
తెలంగాణ ఆదాయ మంతటినీ కెసిఆర్ కుటుంబం దోచు కుంటోం దన్న రాహుల్.. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కెసిఆర్ కుటుంబం చేతిలోనే ఉందని తెలిపారు.
ధరణి పోర్టల్ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని మండి పడ్డారు. రాత్రి అశోక్ నగర్ లో తెలంగాణ యువతో మాట్లాడానన్నారు.
పేపర్ల లీక్ వల్ల ఎంతో నష్టపో యామని యువకులు బాధను వ్యక్తం చేశారని చెప్పారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే అవి రద్దు అయ్యాయని బాధపడ్డారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని బిఆర్ఎస్ ప్రభుత్వం మనకు అవసరమా?అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.