బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గోలి మోహన్ కారుపై కర్రలతో దాడి..
బిఆర్ఎస్ గుండా కార్యకర్తలు తమ వాహనంపై దాడి చేశారని గోలిమోహన్ మండిపాటు..
హ్యూమన్ రైట్స్ టుడే/ వేములవాడ/నవంబర్26:
చందుర్తి గ్రామంలో యూత్ మీటింగ్ పర్యటనలో ఉన్న బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ కారును ధ్వంసం చేసిన బిఆర్ఎస్ గుండా కార్యకర్తలు కారులో ఉన్న 4 వ్యక్తుల మీదికి 50 మంది కర్రలతో దాడికి యత్నించారు. బూతు పదజాలంతో దొరల మీదికే పోటీకి వస్తారా మీరు అని రెండు కార్లను కర్రలతో ద్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పొలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ తెలిపారు.