కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీస్తేస్తామంటోంది..

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి భారీ మెజార్టీతో గెలవబోతుంది: సీఎం కేసీఆర్

హ్యూమన్ రైట్స్ టుడే/నిర్మల్ జిల్లా/నవంబర్ 26:
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

ఆదివారం ఖానాపూర్ ప్రజా ఆశీర్వాధ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో సంక్షేమం ఎలా జరిగింది.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతోందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నాం.. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.

కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంట్ ఇస్తా మంటోంది.. మరీ 24 గంటల కరెంట్ కావాలా..3 గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీస్తేస్తామంటోంది.. ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ కష్టాలే అని.. ధరణి తీసేస్తే అసలు రైతు బంధు డబ్బులు ఎలా పడతా యన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తుందన్నారు. అభ్యర్థులనే కాకుండా.. వాళ్ల వెనకున్న పార్టీలను చూడండని.. ఆ పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.

ఓటు వజ్రాయుధమని.. ఓటు వేసే మందు ఆలోచించకపోతే ఐదేళ్లు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలవగానే ఖానాఫూర్‌ను మరింత ఆ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో మరోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతోతుందని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment