వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్…
ఇన్సూరెన్స్ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/మెదక్/17 జనవరి 2023: జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటపురంలో వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాయక్ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈనెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ధర్మా నాయక్ నాటకం ఆడాడు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు.
ధర్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. తమదైన శైలిలో దర్మను విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన ధర్మ.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నాడు.భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అసలేం జరిగిందంటే..
టేక్మాల్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనె 9న గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దుస్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
కారులో వ్యక్తి సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవరైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరికి కారులోని మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దిగా పోలీసులు గుర్తించారు.