ఇలాంటి సీఎం తెలంగాణకు అవసరమా? నరేంద్రమోడీ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/మెదక్ జిల్లా/నవంబర్ 26:
ఓటమి భయంతోనే కేసీఆర్ ఈ సారి రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని.. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భయపడే కామారెడ్డికీ పారిపోయాడని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అసలు రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడో ఆలోచించాలన్నారు. ఆదివారం తుఫ్రాన్‌లో జరిగిన బీజేపీ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు. ఎప్పుడు ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా? అని తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు.

సెక్రటేరియట్‌కు రాకుండా.. ఎప్పుడు ఫామ్ హౌస్‌లోనే ఉండే సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. త్వరలోనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఫామ్ హౌస్‌కు పంపిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థ నాశనం అయ్యిందని మండిపడ్డారు.

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ హామీలను విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం చేశారని సెటైర్ వేశారు.

కేసీఆర్ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్‌పై రైతులతో పాటు ఆ మల్లన్న స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నాడన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కార్బన్ కాపీ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే రెండు రోగాలకు బీజేపీ మాత్రమే చికిత్స చేయ గలదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగలేదని.. కానీ బీజేపీ మాత్రం బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు.

బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యం అని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ మాత్రమే చూశారు.. ఇక సినిమా చూస్తారని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment