బర్రెలక్క స్పూర్తితో గెలుపు దిశగా కెమెరా గురుతూ అభ్యర్థి: నిజామాబాద్ రూరల్ MLA అభ్యర్థి మేత్రి రాజశేఖర్
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/నవంబర్ 26: బిచ్చగాడి రూపంలో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేయడంలో ప్రజలు విశేషంగా అధిరిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువత రాజకీయలల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, కానీ యువత సిద్ధంగా లేరు మళ్ళీ వచ్చే ఎన్నికల లోపు ఓటు అనే ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చాప కింద నీరులా గెలుపు దిశగా దోసుకుపోతున్న కెమెరా గుర్తు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం నుంచి BLF బలపరిచిన MCPI U అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడిగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేటితరం యువత చట్టసభలలోకి రావాలని ప్రధాన డిమాండ్ తో ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ సమస్య తీరేంతవరకు యువత చట్టసభలలో ప్రశ్నించే గొంతుకగా నిలవాలని 2వ రోజు అరగుండు అరమిసం మరియు చిరిగిన బట్టలతో ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి యువత నుంచి స్వచ్ఛందంగా విశేష స్పందన లభించడం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా కెమెరా గుర్తు గెలుపును కాంక్షిస్తూ వాళ్ళ విలేజ్ గ్రూపులలో సోషల్ మీడియాలలో ఇంస్టాగ్రాములలో తమ వంతు ప్రచారం నిర్వహిస్తూ నా గెలుపును ఆకాంక్షిస్తూ ఓటు వేసి ఆశీర్వదించి, దీవించాలని వారి వంతు ప్రచారం చేస్తున్న వారికి పెరు పేరున పాదాభివందనాలు తెలియ చేస్తూ వారు ఇస్తున్న మద్దతుకు జన్మాంతము రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే బర్రెలక్కా ప్రభావం ఈరోజు నిజామాబాద్ రూరల్ పై పడింది ప్రతి ఒక్కరు బర్రెలక్కా మాదిరిగానే ముందుకు పోవాలని ధైర్యాన్ని ఇస్తూ నువ్వు గెలుస్తావ్ బిడ్డ అని ఆశిర్వాధిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నానని అన్నారు.