నా అన్నలకు,తమ్ముళ్ళకు,ప్రజా ప్రతినిధులకు నమస్కారములు🙏.
నన్ను ఒక్క సారి MLA గా గెలిపించండి.
“బహుజన నాయకుల కలలను నిజం చేస్తా”.
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్:
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని నా ప్రజలు,అన్నలు, తమ్ముళ్లు,నా కంప్యూటర్ గుర్తు కు మీ అమూల్యమైన ఓటువేసి నన్ను గెలిపిస్తే, మన నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో అవినీతి లేని పాలన అందిస్తాను,అందరికి ఇల్లు కట్టిస్తాను,పెన్షన్లు ఇప్పిస్తా,ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా,sc/st బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేపిస్తా,ప్రతి పల్లె కు ఉచితంగా MLA నిధులతో త్రాగునీటి అందించుట కోసం నీటి శుద్ది యంత్రాల ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడుతాను, గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా యువకులకు ఇక్కడే ఉద్యోగాల కల్పన కోసం భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా,తెలంగాణ యునివర్సిటీ లో సుమారు15 ఏళ్లుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చెపిస్తా,కొత్త కోర్సులను అందుబాటులోకితెస్తా,సర్కార్ దవ ఖానలో ఒక మహిళా,పురుష డాక్టర్లు,మందులు అందుబాటులో ఉండేలచేస్తా.ప్రతి తండాకు ఎర్ర బస్సులు నడిచేలా చేస్తా,రైతులు పండిస్తున్న వరిని రైతులే నాబార్డు బ్యాంక్ సహకారంతో రైతు క్లబ్బుల ను ఏర్పాటు చేసి రైతులే వరిని కొనుకొలు చేసేలా కృషిచేస్తా,మధ్య దళారీ వ్యవస్థ అయిన సొసైటీల పాలనను రద్దు చేస్తా,ప్రతి పల్లెలోని మన విద్యార్థులకు అందరికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తాను.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి.!
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.!
ఒక్క సారి MLA గా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇస్తారని ఆశిస్తూ.
కృతజ్ఞతలతో మీ,
బాలరాజు గుగులోత్
MLA అభ్యర్థి,నిజమాబాద్ రూరల్ నియోజక వర్గం.