భారత రాజ్యాంగ గొప్పతనం

Get real time updates directly on you device, subscribe now.

భారత రాజ్యంగ దినోత్సవం #భారత_రాజ్యాంగ_గొప్పతనం

************************
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : భారతదేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అబ్రహం లింకన్ ఉపన్యాసలచే ప్రేరణ పొంది అబ్రహంలింకన్ విశ్వసించిన *ప్రజాభిప్రాయమే సర్వస్వం, ప్రజాభిప్రాయం ఉంటే ఏది విఫలం కాదు. ప్రజాభిప్రాయం లేకుండా ఏది విజయం పొందదు* అనే సూత్రము ద్వారా మరియు 7 దశాబ్ధాల క్రితం అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాల ప్రకటన – 1948పై మొట్టమొదట సంతకం చేసిన దేశం మనదేశం. అంతేకాదు మన రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21.ఎ, 22, 23, 24, 25., 26, 27, 28, 30, 31.ఎ, 31.బి, 31.సి, 32, 33, 34, 35, మరియు 226ను, 311… అధికరణాలను చేర్చి రాజ్యాంగ రచనకు పూనుకొని పూర్తి చేసి జాతికి రాజ్యాంగాన్ని అందించారు.

1949 నవంబర్ 25 నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ బృహత్ యజ్ఞం ఒక కొలిక్కి వచ్చిన దశలో రాజ్యాంగసభయందు ఆయన చేసిన చారిత్రక ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను స్పృశించారు. 1950 జనవరి 26 నుండి పరిధ్యమయ జీవనం మనకు అనుభవంలోకి రానుంది… రాజకీయాలలో సమానత్వ సాంఘిక, ఆర్ధిక రంగాలలో అనేక అసమానతలు గోచరిస్తాయి!..రాజకీయం లో ఒక వ్యక్తికి ఒకే ఓటు, ఒకే విలువ అమలవుతుంది. ఇతరత్రామాత్రం సామాజిక చక్రం ప్రత్యేకత కారణంగా వ్యక్తులందరికి ఒకే విలువ సూత్రం సాధ్యపడదు…

ఈ ఎగుడుదిగుళ్లు కొనసాగినంత కాలం భారత రాజకీయ ప్రజాస్వామ్యం చిద్రమవుతూనే ఉంటుంది… ఈ అసమానతలను రూపుమాపడంలో ఆలస్యం అయ్యేకొద్ది ప్రమాదమేననడంలో అంబేద్కర్ మనోగతం సుస్పష్టం.

భారత రాజ్యాంగ నిర్మాతలు “ప్రజాస్వామ్యవాది అంటే ప్రజాస్వామ్యం పట్ల క్రమశిక్షణ కలిగిన వాడు రాజ్యాంగ, మానవతాసూత్రాలకు ఐచ్చికంగా అనుసరించే వారందరికి అదే అలవడుతుందని” భావించారు. అందుకోసం ప్రజల మేలు పారదర్శకతను కోరుకుంటున్న యువతకు అవకాశాలు పెంపొందించే విధంగా చట్టాలు, అందులోని నిబంధనలను గ్రామ స్థాయిలో రూపొందించే శాసన సభలలో, పార్లమెంట్లో ఆమోదం పొందాలని ఆశించారు. అంతేగాక అధికారం చేపట్టే ప్రతి నాయకుడు, నాయకులు ప్రజా జీవనంలో అధికారమంటే విలువలను పునరుద్ధరించడానికి దోహదం చేసి కొత్త రాజకీయ సంస్కృతిగా భావించి ప్రతి భారతీయుడి లోపల జాతీ, సంక్షేమం కోసం తమ సమయాన్ని శక్తి సామార్ద్యాలను కొంతైనా వెచ్చించేందుకు తోడ్పడేలా, సమాజాన్ని జాగృత పరచడానికి ప్రతి యువకుడికి అవకాశం కల్పించే విధంగా అవకాశాలు ఉండాలని రాజ్యాంగంలోని అథికరణా (నిబంథన)లను చేర్చడంద్వారా నాటి రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు.

అందుకోసం మనకు రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థాపించారు. అనగా మనది ప్రజా ప్రభుత్వం కేంద్రంలోని పార్లమెంటు సభ్యులను రాష్ట్రాలలోని చట్ట సభల సభ్యులను ప్రజలమైన మనం ఎన్నుకునేటట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ పాలుపంచుకోవాల్సి ఉందని స్వాతంత్ర్య సమరయోదుల ఆశయంగా వయోజన ఓటింగు పద్ధతిని రాజ్యాంగంలో ప్రవేశపెట్టి పొందుపరచబడ్డది.

కేంద్ర, రాష్ట్ర చట్టసభల ప్రతినిధులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నేడు ప్రజాభిప్రాయాల్ని అన్ని ప్రాఔతాలలో జరపకుండా కేంద్ర, రాష్ట్ర చట్టసభలు తమకు తాముగా చట్టాలను రూపొందిస్తున్నాయి.ఆ చట్టాలను, అందులోని నిబంధనలకు ప్రభుత్వ యంత్రాంగం అమలు పరుస్తుంది. అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడానికి *న్యాయవ్యవస్థ* ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు పరచడానికి *చట్టసభలు*, *ప్రభుత్వ యంత్రాంగం*, *న్యాయ వ్యవస్థ* ఈ మూడు కలిసి పనిచేస్తాయని, ఇవి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సత్యం, శివం, సుందరంలాంటివని ప్రతి ఒక్కరు నమ్మాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించినారు. అందుకు రాజ్యాంగంలో రాజకీయ పని విధానాన్ని ప్రభావితం చేసే సంస్థలను మూడు రకాలుగా పొందుపరిచినారు.

*వాటిలో స్వతంత్రప్రతిపత్తి కలిగి ఉండేటట్లు ఎన్నికల కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఫైనాన్స్ కమీషన్, కంప్ట్రొలర్ అండ్ ఆడిటర్ జనరల్… రాజ్యాంగబద్ద సంస్థలుగా పనిచేస్తున్నాయి*.

*జోనల్ కౌన్సిళ్ళు, జాతీయ ఎస్సి, ఎస్టీ, బిసీ, మహిళ మైనార్టి కమీషన్లు, జాతీయ మానవ హక్కుల కమీషన్లు, చట్టబద్ధ సంస్థలుగా పనిచేస్తున్నాయి*.

*ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమైక్యతి మండలి, జాతీయ భద్రతా మండలి… రాజ్యాంగేతర, చట్టబద్ధేతర, సలహా మండళ్లుగా రాజ్యాంగంలోని అధికరణాల ద్వారా పొందుపరిచారు*.
ఈ సంస్థలన్నింటిని రాజకీయ వ్యవస్థ లోని పాలకవర్గంవారు ప్రజాభిప్రాయంతో నిత్యనూతనంగా తీర్చిదిద్దడంవల్ల అన్ని ప్రజాసంస్థలు పాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొదించడం కోసం పని చేస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు.

అలాగే మరో రెండు ధర్మాంశాల పట్ల ప్రగఢామైన విశ్వాసం కలిగి ఉండటం మంచిదని ఆశించారు. ఆ ధర్మాలు ఇవి మనదైన ఈ దేశమే ప్రపంచంలో మహూత్కృష్టమైన దేశం. మనదైన ఈ భారత జాతే మహూత్కృష్టమైన జాతి అని ప్రతి ఒక్కరు విశ్వసించాలని మారణాయుధాలతో విజయం కోసము చేసే యుద్ధం కన్న రాజ్యాంగానికి లోబడియున్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చట్టాలలోని నిబంధనలకు విలువలను పెంపొందించే న్యాయపోరాటమే గొప్పదని మనసా, వాచా, కర్మణా విశ్వసిస్తూ ఆశవాహదృక్పథం తో రాజ్యాంగ రక్షకులైన వారిని ఆశ్రయించి న్యాయాన్ని పొందాలని, అందుకోసం పౌరులు వారి లక్ష్యాలను వారే నిర్దేసించుకోవాలని, పౌరులు ఏ విత్తనం (నాయకులు) పాతితే (చట్టసభలకు పంపితే) ఆ పంటే చేతికి (పరిపాలన) అలాగే వస్తుందని, పౌరుల భవిష్యత్తు నిర్మాతలు వారే కనుక నచ్చిన వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య విధులను నిర్వహించే బాధ్యతలను అప్పజెప్పి ఈ యావత్ ప్రపంచమే భారతీయులదే అని ప్రతి ఒక్కరు భావించే తత్వం పెంపొందించుకోవాలని రాజ్యాంగనిర్మాతలు భావించారు.

*వ్యాఖ్యానం:-*

దురదృష్టవషాత్తు రాజ్యాంగ నిర్మాతలు ఏమి జరగకూడదనుకున్నారో అదే జరుగుతుంది. తగ్గుముఖం పట్టాల్సిన సామాజిక అసమానతలు నేటి కుహానా రాజకీయ నాయకుల వల్ల, వారి పనుల వల్ల సామాజిక అసమానతలు మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయి.15-20 సంవత్సరాలలో అణగారిన,వెనుకబడిన తరగతుల వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని తమకు ఇష్టము లేకున్న సూచించారు.. అభివృద్ధి వైపు అనుకూలంగా పయనించే వారిని అభివృద్ధి చెందిన వర్గంగా గుర్తించాలని సూచించగా దానిని గాలికొదిలేసి కుల-మత వర్గాల పేరిట, ఇంకా కొన్ని రకాల వర్గాలను వెనుకబాటలో ఉన్న వర్గాలుగా తమ రాజకీయ ఆధిపత్యం కోసం వెనుబడిన వర్గాల ఖాతాలో చేర్చుతూ,అభివృద్ధి చెందిన వర్గంగా ఏ వర్గంను చెప్పుకోలేని స్థితికి దిగజార్చుకుంటూ ఇటు న్యాయం జరగాల్సిన వర్గాలు అన్యాయానికి గురవుతూ ఉంటే మరోవైపు దేశం ప్రపంచ దేశాల కంటే ముందుకు దూసుకు వెళుతుందంటూ డాంబికంగా చెప్పుకుంటున్నారు తప్ప అట్టడుగు స్థాయి వ‌ర్గాల వారికి న్యాయం చేయడానికి ప్రణాళికలు తయారు చేసిన దాఖలాలు మచ్చుకైనా కనిపించడంలేదు. 70 ఏళ్ళ క్రితం చెప్పులు కుట్టే వారి కుటుంబం నేటికి అదే స్థితిలోను, మగ్గం నేసేవారి కుటుంబం నుంచి నేటికి అదే దుస్థితిలో ఉండడం, పొలం దున్నే వారి కుటుంబంలో నేటికి పొలం దున్నే దుస్థితిలో ఉండడం 70 ఏళ్ళ క్రితం నుండి భూ స్వాములుగా, ధనికులుగా కనిపించేవారు నేటికి అదే విధంగా కనిపించడం,దండుకునే వాడికి దండుకున్నంత అనే చందాన తదనుగుణంగా వర్గ విభేదాలు అదుపు తప్పుతున్నాయి.

కాని నేడు రాజ్యాంగ మానవతాసూత్రాలను ఉల్లంఘించడం అలవాటుగా మారిపోయిన ప్రజాతంత్రంలో “సుప్రీం” అయిన ప్రజానికం ఎంతకీ సాదులక్షణం వీడక పోవడమే తమకు రక్షణ కవచమని వారు నిరాశ, నిస్పృహలకు లోనై నేరస్తులకు ఓట్లు వేస్తున్నారు. ఇటువంటి అక్రమార్కులను ఎన్నుకోవడం చేత ప్రజా ప్రతినిధులు తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నట్లయితే ఏ విధమైన సమస్యలు ఉండవని ఏకంగా రాజ్యాంగంలో అన్ని వ్యవస్థలకు సవ్యంగా ఉన్నా ధర్మాన్ని పాటించి రాజ్యాంగ నిబంధనలను అనుసరించి, విధులను నియమానుసారం నిర్వహిస్తానని (భగవత్ గీత)దేవుడి మీద ప్రమాణం చేసే విధానాన్ని తొలగించి కేవలం న్యాయ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా అన్నట్లుగా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను అనే పదం వాడుతున్నారు. రాజ్యాంగంలో లిఖించిన విధానం ఏమిటంటే కుల, మత, వర్గ బేధం లేకుండా అటు చట్ట సభల్లో వచ్చిన ప్రజా ప్రతినిధులు ఇటు న్యాయ వ్యవస్థ లోనికి వచ్చిన న్యాయ విచారణ చేపట్టిన న్యాయ మూర్తులు భగవత్ గీతను ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగ గ్రంధంగా పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేయాలని రాజ్యాంగంలో పొందుపరిచారు.కానీ ఆ విషయంను గాలికొదిలేసి …….అనే నేను రాజ్యాంగం కల్పించిన నియమ నిబంధనలను పాటిస్తానని చిలుక పలుకులు పలుకుతూ విధి విధానాలు అమలు చేయడంలో వెనుకడుగు వేస్తూ చిన్నపాటి నేరస్థులను పట్టడానికి చట్టాలను పటిష్టంగా ఉపయోగించడం, గజదొంగలపై ఉన్న పటిష్టమైన చర్యలు తీసుకోవడం వదలేసి చట్టాల దుర్వినియోగంనకు అవకాశాలు కల్పించడం వలన దోపిడీ దొంగలు బహిరంగంగా తప్పించుకు తిరుగుతున్న వారిని ఏమీ చేయలేక పోవడం వల్ల కలిగే నష్టాలు అంతా ఇంతా కాదు. అని భవిష్యత్ తరాలకు ఇవవలసిన ఉపశమనాలను తుంగలో తొక్కి అన్ని హక్కులూ కాలరాస్తు ఉండడం విషాదాగమనమునకు సంకేతం అని చెప్పవచ్చును.

అటు కల్లబొల్లీ మాటలు చెబుతూ ఇటు ప్రజాప్రతినిధుల పాలన, ప్రభుత్వ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు చేసే క్రమంలో ముమ్మాటికి ఖచ్చితంగా పాటించవలసిన ప్రామాణికత గల నియమ-నిబంధనలను తొలగించడం వలన ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు దొడ్డి దారిన దోచుకోవడానికి, అక్రమ ఆస్తులు సంపాదించడం ఎలా తయారు చేసుకోవాలి ఆలోచనకు మార్గాలు ఎంచుకుంటుంటారు.వీటన్నింటికీ మూలకారణం అవసరమైన వేళల్లో యుద్ధ ప్రాతిపదికన నిబంధనలలో మార్పులు చేర్పులు అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం.

ఈ కథ మారనంతవరకు ప్రజాస్వామ్యానికి వ్యధ తప్పదు. *ఎందుకనగా సామాన్య ప్రజలకు భారత రాజ్యాంగం అంటే ఏమిటి దాని గొప్పదనం ఏమిటి? అని చెప్పేవారే కరువయి, భారత సంస్కృతి పతనమవ్వడమే కాక భావితర జీవితాలను మెరుగుపరచలేని నాగరికత రాజ్యాంగానికి విలువ ఇవ్వని చట్ట వ్యవస్థలు ఉండి ఏం లాభం? రాజ్యాంగ బద్ద పాలన అంటూ రాజ్యాంగానికే తూట్లు పొడిచే వారే పాలకులవుతున్నారు ఇక అలాంటి వారిని ఎదగకుండా పౌరులే అడ్డుకోవాలి. లేదంటే నేరగాళ్లకు అవినీతి పరులకు అభయా అరణ్యంగా మారి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ శిథిలం కాక తప్పదు.* అందుకోసం రాజ్యాంగంలోని అధికరణాలు ఉన్నవి ఉన్నట్లుగా అమలు పర్చేటట్లు చూసుకోవాలి.అవసరమైన సమయ-సంధర్భంలలో చట్టంలోని నియమ నిబంధనలను మార్పులు-చేర్పులు ఉండాలి. అప్పుడే రాజ్యాంగానికి అందులోని అధికరణాలకు, అధికరణాల ద్వారా వచ్చిన చట్టాలకు అందులోని నిబంధనలకు పాలన కోసం వచ్చిన ఉత్తర్వులకు గౌరవాన్ని పెంపొందించీన పౌరులమవుతాం. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలనే ఏ మాత్రం మార్పు వచ్చినా మనుషులు మహా మేధావులు అవుతారు. నిజమైన మనుషుల్లో మనుగడ సాగించగలుగుతారు.
~~~~~~~~~~~~~~~~~

*మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ*

*నువ్వు ఏ చట్టం ఎలా చేయాలా అని సంధిగ్ధానికి లోనయినపుడు, జీవితంలో నీకు తారసపడ్డ అత్యంత నిరుపేద, నిస్సహాయుడి ముఖాన్ని, గుర్తుకు తెచ్చుకుని ఇపుడు నువ్వు చేయాలనుకున్న లేదా తలపెట్టాలనుకున్న పని/చట్టం వలన అతనికి ఏ విధంగానయినా సాయపడుతుందా, అతను తన బ్రతుకును తాను కోరుకుంటున్నట్లు బ్రతకడానికి,తన జీవితం సఫలం చేసుకోవడానికి, నువు చేయబోయే పని/చట్టం అతనికి ఏమయినా సహాయం చేస్తుందా!అని ఆత్మవలోకనం చేసుకో. అపుడు పాలకుడిగా నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది*

*నా యొక్క స్వప్న భారత దేశంలో* అతి పేదవాడు కూడా నాది అని భావించి దేశమునకు ఉన్నత వర్గము మరియు బడుగు వర్గంల తారతమ్యంలు లేక ప్రజలు గర్వింతురో అటువంటి భారత దేశం కోసం అన్ని వర్గాల ప్రజలు శాంతి, అహింసలతో కలిసి జీవనం సాగించు భారత దేశంనకు నేను శ్రమించెదను.అటువంటి భారత దేశంలో అస్పృస్యత లేదా మద్యపానంలు మరియు మత్తు పదార్ధంలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. మహిళలు పురుషులతో సమానంగా తమ హక్కులను అనుభవించెదరు.మిగిలిన ప్రపంచంతో సహా మనమందరం శాంతి సౌఖ్యంలతో జీవించెదము.ఇది నా యొక్క కలల భారత దేశం.
~~~~~~~~~~~~~~~~~

*భగత్ సింగ్*

కేంద్ర అసెంబ్లీలో బాంబు దాడి కేసులో విచారణ సంధర్భంగా జూన్-6,1929 విప్లవం అంటే బాంబులు, పిస్తోళ్ళ సంస్కృతి కానేకాదు.అన్యాయం మీద ఆధారపడకుండా వర్తమాన సామాజిక వ్యవస్థలలో అసమానతలు మచ్చుకైనా లేకుండా మార్పు రావాలి అన్నదే విప్లవం వల్ల ఆశిస్తున్నది,అలాగే స్వాతంత్ర్యంనకు అర్ధం తెల్లవారి చేతుల్లోని అధికారం నల్లవారి చేతుల్లోకి మారడం కాదు, అలా జరిగితే అది “అధికార మార్పిడి”అవుతుంది. భారత దేశంలో అసలుసిసలైన స్వాతంత్ర్యం తిండి గింజల్ని పండించే రైతు ఆకలితో అలమటిస్తూ నిద్రపోనప్పుడు, చేనేత కార్మికుల ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఉండనపుడు, నిర్మాణ కార్మికుడికి పక్కా ఇళ్లు ఉన్నప్పుడు మాత్రమే భారత దేశంలో అసలుసిసలైన స్వాతంత్ర్యం సాధించినట్లు.
~~~~~~~~~~~~~~~~~

*డా!!.బి.ఆర్. అంబేద్కర్*

మనం నాగరికత సమకూర్చిన వస్తుగత ప్రయోజనాలనైనా వదులుకోచ్చునేమొ కానీ రాజ్యం రూపొందించుకున్న సర్వోన్నత్కృష్టమైన రాజ్యాంగం, రాజ్యాంగం నుండి ఏర్పడిన చట్టాలు, చట్టాల నుండి ఏర్పడిన వ్యవస్థలు, వ్యవస్థల నుండి వచ్చే ఫలాలను ప్రతి పౌరుడు సంపూర్ణంగా అనుభవించే అవకాశాలను, హక్కులనూ కోల్పోకూడదు.

👉👉 ప్రతి పౌరుడు హక్కులను కోరుకుంటూ ఉండి బాధ్యతలను విస్మరిస్తే అరాచకం తప్పదు.

*విశ్లేషణ మరియు వ్యాఖ్యానం*
మల్లికార్జున రెడ్డి. పంట
మానవ హక్కుల ప్రతినిధులు
గిద్దలూరు, ప్రకాశం జిల్లా

నరేష్ చాగంటి
ఎడిటర్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment