కేంద్ర పోలీస్ బలగాల ఆధీనంలోకి భద్రాచలం ఏజెన్సీ పోలింగ్ కేంద్రాలు
హ్యూమన్ రైట్స్ టుడే/భద్రాచలం/నవంబర్ 25:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.
తెలంగాణ లో ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు అధికారులు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చర్ల, దమ్ముగూడెం మండలాల్లోని పోలింగ్ స్టేషన్లను కేంద్ర బలగాలు, పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నాయి.
పోలింగ్ స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావితం ప్రాంతం కావడంతో ఈ ఏరియాలో అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసు కుంటున్నారు.