బీఆర్ఎస్, బీజేపీ సర్కార్లపై ప్రియాంక గాంధీ ఫైర్
హ్యూమన్ రైట్స్ టుడే/సిద్దిపేట: హుస్నాబాద్ కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కష్టపడి చదివితే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.