మాజీ ఐఏఎస్ అధికారి ఇంటిలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /నవంబర్ 24:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న తరుణంలో ఎన్నికల అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేయడం పొలిటికల్స్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా శుక్రవారం సాయంత్రం హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఎలక్షన్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
భారీగా డబ్బు డంప్ చేశారన్న సమాచారం మేరకు.. మాజీ ఐఎఏస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సెర్చ్ అపరేషన్ చేపట్టారు.
ఏకే గోయల్ ఇంట్లో అధికారులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కాగా, మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు.
ఈ నేపథ్యంలో ఏకే గోయల్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.